జ్వరం, జలుబుకు ఇంజెక్షన్.. 14 ఏళ్ల బాలిక మృతి! ఖమ్మంలో ఆర్ఎంపీపై కేసు
August 12, 2026
జ్వరం, జలుబుతో...
READ MORE
ప్రజంట్ జనరేషన్‌లో ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా ఊబకాయం ఒక నిశ్శబ్ద శత్రువులా మారుతోంది. జిమ్‌లలో గంటల తరబడి వ్యాయామాలు చేసినా... ఇష్టమైన స్వీట్లు మానేసినా... చాలా మందిలో బరువు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.ఇదిలా ఉండగా... ఆరోగ్య నిపుణులు కీలక విషయాన్ని వెల్లడిస్తు న్నారు. మన రోజువారీ వంటల్లో ఉపయోగించే నూనెనే బరువు పెరుగుదలకు ప్రధాన కారణంగా మారుతోందని చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం.. బరువును నియంత్రించాలంటే వంట నూనె వినియోగాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అధిక నూనె వాడకం శరీరంలో కొవ్వు నిల్వలను పెంచి... ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ వంటి వ్యాధులకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాబట్టి... ఆరోగ్యకరమైన జీవనశైలికి.. తక్కువ నూనెతో వంటలు చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అత్యంత అవసరం.
ఆరోగ్యానికి అసలైన ముప్పు ఇదే..! ఊబకాయం అనేది కేవలం రూపానికి సంబంధించిన సమస్య కాదు, అది అనేక జబ్బులకు మూలం. ముఖ్యంగా పొట్ట భాగంలో పేరుకుపోయే కొవ్వు పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు చేరి రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. తద్వారా గుండె జబ్బులు తలెత్తుతాయి. మధుమేహం ఉన్నవారిలో శరీరంలో ఇన్సులిన్ పనితీరును మందగింపజేస్తుంది. అధిక బరువు వల్ల బీపీ పెరిగి ప్రాణాపాయం సంభవించవచ్చు. కాలేయంలో అనవసరమైన కొవ్వు చేరడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది.
బరువు తగ్గడానికి ఖరీదైన డైట్లు, మందులు అక్కర్లేదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ చిట్కాను అందించింది. ప్రతిరోజూ మీరు వాడే వంట నూనె పరిమాణాన్ని కనీసం 10శాతం తగ్గించమని వెల్లడించింది. వంటల్లో నూనెను తగ్గించడం వల్ల శరీరంలోకి చేరే అదనపు క్యాలరీలు గణనీయంగా తగ్గుతాయి. ఫలితంగా నిల్వ ఉన్న కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం వివిధ వేదికలపై ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం వంట నూనె వినియోగాన్ని నియంత్రించాలని ప్రజలకు సూచించిన సంగతి తెలిసిందే.
నూనె వాడకాన్ని ఎలా తగ్గించాలి మరి..?వంటలో రుచి తగ్గకుండా నూనెను నియంత్రించడానికి ఈ చిట్కాలు పాటించండి. వేయించిన పదార్థాల కంటే ఉడికించిన లేదా ఆవిరిపై ఉడికించిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. నాన్ స్టిక్ పాత్రలు వాడటం వల్ల తక్కువ నూనెతో వంటలు చేయవచ్చు.నూనెను నేరుగా డబ్బా నుండి పోయకుండా, స్పూన్‌తో కొలిచి వాడండి. హోటల్ ఆహారంలో అధికంగా, నాణ్యత లేని నూనె ఉంటుంది, దీనికి దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యకరమైన రేపటి కోసం నేడే మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. కేవలం వంట నూనె వాడకాన్ని తగ్గించడం ద్వారానే మీరు ఊబకాయం నుండి విముక్తి పొంది, ఉత్సాహంగా ఉండగలరు. గుర్తుంచుకోండి.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, మీ వంటగదిలోనేఉంది..! మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి…
August 12, 2026
జ్వరం, జలుబుతో...
READ MOREJuly 10, 2026
NEET పరీక్ష నిర్వహ...
READ MOREJuly 10, 2026
ఆరోగ్య రంగంలో **క...
READ MOREJuly 1, 2026
భారతదేశంలో రక్త...
READ MOREJune 30, 2026
ఈ-కామర్స్, క్విక్-క...
READ MORE