▶ Reels

హెపటైటిస్‌-సి రోగులకు ఊరట: అమెరికా ఫార్మా దిగ్గజానికి షాకిచ్చిన భారత పేటెంట్ కార్యాలయం


Relief for Hepatitis C Patients: Indian Patent Office Delivers a Shock to US Pharma Giant

హెల్త్ ఎక్స్ పర్ట్ : హెపటైటిస్‌-సి (Hepatitis C) రోగులకు భారీ ఊరటనిస్తూ భారత పేటెంట్ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ అమెరికన్ ఫార్మాస్యూటికల్ సంస్థ 'అబ్బ్వీ' (AbbVie) ఆశించిన పేటెంట్ దరఖాస్తును భారత్ తిరస్కరించింది. హెపటైటిస్‌-సి చికిత్సలో కీలకమైన గ్లెకాప్రెవిర్/పిబ్రంటాస్విర్ (Glecaprevir/Pibrentasvir) కాంబో థెరపీపై గుత్తాధిపత్యం కోసం సదరు సంస్థ చేసిన ప్రయత్నాలకు బ్రేక్ పడింది.

ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో 'మావిరెట్' (Mavyret) బ్రాండ్ పేరుతో అమ్ముడవుతున్న ఈ ఖరీదైన మందు.. ఇకపై భారత్‌లో అత్యంత చౌకైన 'జెనరిక్' రూపంలో సామాన్య రోగులకు అందుబాటులోకి రానుంది.

అసలేం జరిగింది అంటే..?

అమెరికాకు చెందిన అబ్బ్వీ సంస్థ ఇప్పటికే ఈ కాంబో థెరపీపై ఉన్న హక్కులను మరింత కాలం పొడిగించుకునేలా, రెండో పేటెంట్ కోసం భారత పేటెంట్ కార్యాలయాన్ని ఆశ్రయించింది. అయితే, భారత పేటెంట్ చట్టంలోని సెక్షన్ 15 నిబంధనల ప్రకారం ఈ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీనిపై సదరు ఫార్మా సంస్థ ఎలాంటి అదనపు సాక్ష్యాధారాలను సమర్పించలేకపోయింది. చివరకు తన దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ప్రజారోగ్యానికి పెద్ద పీట..

భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ ప్రజారోగ్య పరిరక్షణ సంస్థలు స్వాగతించాయి. థర్డ్ వరల్డ్ నెట్‌వర్క్ (TWN) ప్రతినిధులు ఈ తీర్పును ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

"అనవసరమైన పేటెంట్ హక్కుల ద్వారా మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని సృష్టించి, మందుల ధరలను సామాన్యుడికి అందనంత ఎత్తుకు తీసుకెళ్లే కార్పొరేట్ వ్యూహాలకు ఈ తీర్పు అడ్డుకట్ట వేసింది. భారతదేశ పేటెంట్ చట్టాల బలం, ప్రాముఖ్యతకు ఇది నిదర్శనం."-థర్డ్ వరల్డ్ నెట్‌వర్క్ (TWN).

జెనరిక్ మందులతో ప్రాణదానం..

హెపటైటిస్‌-సి కాలేయానికి సోకే ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్. దీని చికిత్సకు ఈ కాంబో థెరపీ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఒకవేళ అమెరికా కంపెనీకి పేటెంట్ దక్కి ఉంటే, మరే ఇతర సంస్థ ఈ మందును తయారు చేయడానికి వీలుండేది కాదు. దీనివల్ల మార్కెట్లో పోటీ లేక ధరలు విపరీతంగా పెరిగేవి. ప్రస్తుత నిర్ణయంతో భారతీయ జెనరిక్ ఫార్మా కంపెనీలు తక్కువ ధరకే ఈ ఔషధాన్ని తయారు చేసి మార్కెట్లోకి తెచ్చేందుకు మార్గం సుగమమైంది. ఫలితంగా వేలాది మంది రోగులకు తక్కువ ఖర్చుతోనే ప్రాణరక్షణ లభించనుంది.

Related Blogs


భోజనం తర్వాత స్వీట్ తింటున్నారా..? ‘షుగర్ క్రాష్’ ముప్పుపై వైద్య నిపుణుల హెచ్చరిక..

June 16, 2026

 గులాబ్ జామున్, ర...

READ MORE

చక్కెరకు బైబై.. ప్రకృతి ప్రసాదించిన ప్రత్యామ్నాయ పదార్థాలు..!

June 16, 2026

తీపి తినాలనే కోరిక...

READ MORE

మీరు 24 గంటలూ ఏసీ వాతావరణంలోనే గడిపేస్తున్నారా..?

June 11, 2026

వేసవి కాలం ముదిరే ...

READ MORE

టీతో రస్క్ ముంచుకుని తింటున్నారా..? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

June 10, 2026

ఉదయం లేదా సాయంత్రం...

READ MORE

దుష్ప్రభావాలు లేని చికిత్స : క్యాన్సర్ రోగులకు ఊరట.. ‘పూణే’ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ..

June 6, 2026

క్యాన్సర్ మహమ్మార...

READ MORE
About Health Expert

The Health Expert...


Follow Us


Copyright © The Health Expert. All rights reserved.