▶ Reels

మీ బాడీలో ఖనిజ లవణాల లోపం తలెత్తితే ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలుసా..?


Do you know what diseases can arise if a mineral deficiency develops in your body?


హెల్త్ ఎక్స్ పర్ట్ : ఖనిజాలు మన శరీరంలో జరిగే రసాయనిక ప్రక్రియలకు అత్యవసరం. ఇవి ఒకరోజుకు అవసరమైనంత మోతాదులో లేకపోతే అనేక వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యమైన ఖనిజాల లోపం వల్ల కలిగే తీవ్ర ప్రభావాల గురించి తెలుసుకుందాం.. 

ముఖ్యమైన ఖనిజాల లోపం వల్ల వచ్చే వ్యాధులు..

ఇనుము లోపం (Iron Deficiency)..దీని వల్ల రక్తహీనత (Anemia) వస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా దెబ్బతింటుంది.

లక్షణాలు ఎలా ఉంటాయంటే.. తీవ్రమైన అలసట, నీరసం, ఊపిరి ఆడకపోవడం.

కాల్షియం లోపం (Calcium Deficiency)..ఇది ఎముకల బలహీనతకు (Osteoporosis) దారితీస్తుంది. ఫలితంగా ఎముకలు విరగడం, కీళ్ల నొప్పులు వస్తాయి.

అయోడిన్ లోపం (Iodine Deficiency)..దీని వల్ల థైరాయిడ్ గ్రంథి వాపు (Goiter) వస్తుంది. దీని వల్ల శరీరంలో రసాయనిక ప్రక్రియలు నెమ్మదిస్తాయి.

పొటాషియం లోపం (Potassium Deficiency)...ఇది కండరాల తిమ్మిర్లు (Muscle Cramps), బలహీనతకు కారణమవుతుంది.

జింక్ లోపం (Zinc Deficiency)..ఇది చర్మ, జుట్టు సమస్యలు (Skin & Hair Issues) తలెత్తుతాయి. జుట్టు రాలడం, గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Related Blogs


ఈ పండ్లను కలిపి తింటే అనారోగ్య సమస్యలు తప్పవు ..

June 19, 2026

ఆరోగ్యంగా ఉండటాని...

READ MORE

ప్రతి దగ్గుకూ సిరప్ అవసరమా?.. ఇకపై డాక్టర్ చిట్టీ ఉంటేనే అమ్మకాలు..!

June 19, 2026

వాతావరణంలో మార్పు...

READ MORE

రక్తంలో చక్కెరను అదుపు చేసే అమృతపానం..మధుమేహ బాధితులకు కాకరకాయ రసంతో మేలు..!

June 17, 2026

ప్రస్తుత కాలంలో డయ...

READ MORE

భోజనం తర్వాత స్వీట్ తింటున్నారా..? ‘షుగర్ క్రాష్’ ముప్పుపై వైద్య నిపుణుల హెచ్చరిక..

June 16, 2026

 గులాబ్ జామున్, ర...

READ MORE

చక్కెరకు బైబై.. ప్రకృతి ప్రసాదించిన ప్రత్యామ్నాయ పదార్థాలు..!

June 16, 2026

తీపి తినాలనే కోరిక...

READ MORE
About Health Expert

The Health Expert...


Follow Us


Copyright © The Health Expert. All rights reserved.